శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ తుల్జా భవాని ఆలయ పాలకమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున శర్మను శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా శేరిలింగంపల్లి లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సిసలైన ఉద్యమకారుడు మల్లికార్జున శర్మ అని కొనియాడారు. శేరిలింగంపల్లి లో ఉద్యమానికి భీష్మపితామహులుగా ఉన్నా మల్లికార్జున శర్మకు ఎట్టకేలకు కొంత గుర్తింపు లభించిందనందుకు సంతోషం అన్నారు. డివిజన్ ప్రధాన కార్యదర్శిలు చిట్టారెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నర్రా జయలక్ష్మి, శివ కుమార్, మారం వెంకట్, శాంతి భూషణ్ రెడ్డి, వచ్చు రాజు, శ్రవణ్ పాడే తదితరులు పాల్గొన్నారు.