దామోద‌ర్ రెడ్డికి క‌రోనా వారియ‌ర్ అంత‌ర్జాతీయ అవార్డు

హైదర్ నగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్ తెరాస గౌర‌వాధ్య‌క్షుడు దామోద‌ర్ రెడ్డికి క‌రోనా వారియ‌ర్ అంత‌ర్జాతీయ అవార్డు ల‌భించింది. ఈ మేర‌కు ఆయన ఆదివారం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండేషన్ ఎండీ సత్యవోలు రాంబాబు చేతుల మీదుగా ఆ అవార్డును అందుకున్నారు. కరోనా సమయంలో దామోద‌ర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, అన్నదానం, మాస్క్స్, శానిటైజర్స్, రక్తదాన శిబిరాలు.. ఇలా ఎన్నో స‌మాజ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. దీంతో ఆయ‌న సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ అవార్డును ఆయ‌నకు అంద‌జేశారు.

సత్యవోలు రాంబాబు చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న దామోద‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here