నమస్తే శేరిలింగంపల్లి: వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముంపు సమస్య లేకుండా నాలా విస్తరణ పనులను చేపట్టడం జరుగుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాల వరకు రూ.15.88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కి.మీ ల మేర చేపడుతున్న నాల విస్తరణ పనులను మదీనగూడ రామ కృష్ణ నగర్ లో స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా నాల విస్తరణ పనులు చేపట్టామన్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాల విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా రామకృష్ణ నగర్ లో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు వంటి సమస్యలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. దశల వారిగా అభివృద్ధి పనులు చేపట్టి కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. కార్యక్రమంలో ఏఈ ప్రతాప్, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ మానస, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, రామకృష్ణ నగర్ కాలనీ వాసులు ఉమామహేశ్వర రావు, విష్ణువర్ధన్ రెడ్డి, మహేష్, సురేందర్, బాలకృష్ణ , రాజు, రసూల్, రవి చంద్ర, నాగేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, పవన్ తదితరులు పాల్గొన్నారు.