నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా జూలై 2,3 తేదీల్లో పరేడ్ గ్రౌండ్స్ లో తలపెట్టిన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. మసీద్ బండ, కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజక వర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రవికుమార్ యాదవ్ విస్తృత ప్రచార వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రధాని, జాతీయ అగ్రనాయకులు జాతీయ కార్యవర్గ సమావేశాలకు రానున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఘన స్వాగతం పలుకుతూ ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయడమే ధ్యేయంగా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ నెల 29 నుండి కేంద్ర మంత్రులు, అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గానికి, ప్రతి డివిజన్ కు, ప్రతి బూతుకు మనతో మమేకమై కలిసి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల ఎల్లేశ్, రాధాకృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, ఆంజనేయులు సాగర్, ఆకుల లక్ష్మణ్, గణేష్ ముదిరాజ్, ఆదిత్య, జె.శ్రీను, జె.రాము, దినేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
