నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు, జగదీష్ యువ సంఘటన కార్యకర్తలు పలు సామాజిల సేవా కార్యక్రమాలు చేపట్టారు. జగదీశ్వర్ గౌడ్ తనయుడు వైభవ్ కృష్ణ ఆధ్వర్యంలో మియపూర్ లోని శ్రీ షిర్డీ సాయి బాబా ఆశ్రమం, ఓం శాంతి ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలను ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్స్ లో పేదలకు భోజనాలు అందించారు. కొండాపూర్ ప్రభుత్వ దవాఖానలో కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైభవ్ కృష్ణ మొక్కలను నాటారు. కోవిడ్ లాంటి క్లిష్టమైన సమయంలో ప్రజలకు అండగా ఉంటూ వారి ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా అహర్నిశలు కృషి చేసిన వైద్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యూత్, జగదీష్ యువ సంఘటన చైర్మన్ పి.శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కనకమామిడి నరేందర్ గౌడ్, వీరేశం గౌడ్, సత్యనారాయణ గౌడ్, వివేక్ గౌడ్, రోహిత్ గౌడ్, శ్రీశైలం, దేవేందర్, బాలకృష్ణ, లక్ష్మణ్, మల్లేష్, బాలరాజు ముదిరాజ్, కుమార్, దయాకర్ రావు, వెంకట్ రెడ్డి, వెంకట్ రామయ్య, శైలేష్, నయీమ్, క్రాంతి, సంతోష్, భాస్కర్, రాము, విపిన్, నరేష్, శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు జయ సాయి, సభ్యులు భాస్కర్, రాజు, సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు.