కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాల పట్ల ఐక్య పోరాటం చేయాలి – ఎంసీపీఐ(యు) పోలిట్ బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం – ఘనంగా ప్రారంభమైన ఎంసీపీఐ(యు) రాష్ట్ర తృతీయ మహాసభలు

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలకు పరిష్కారం వామపక్ష సామాజిక ఐక్య పోరాటాలు, బహుజన రాజ్యాధికారమే చూపుతుందని ఎంసీపీఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం అన్నారు. అగ్రవర్ణ మనువాద భావజాలానికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలో మియాపూర్ ప్రాంతంలోని సోని గార్డెన్ లో ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు కామ్రేడ్ తాండ్ర కళావతి, వంగల రాగసుధ, గడ్డం నాగార్జున, ఎస్ కే నజీర్, వస్కుల గోపి అధ్యక్షత వ్యవహరించగా కామ్రేడ్ కాటం నాగభూషణం మాట్లాడారు. అగ్రవర్ణ మతోన్మాద పాలనలో దేశం అధోగతి పాలవుతుందన్నారు.

ఎంసీపీఐయూ తృతీయ మహాసభల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న కామ్రేడ్‌ కాటం నాగభూషణం

అందుకు ప్రత్యక్ష నిదర్శనమే అగ్నిపథ్ పథకం దేశ రక్షణను సైతం పెట్టుబడిదారులకు కట్టబెట్టే పథకం లో భాగంగా ప్రధాని మోడీ వ్యూహరచన చేశారన్నారు. యువతకు ఉపాధి, మహిళల రక్షణ, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్య, వైద్యం, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని ఎద్దేవా చేశారు. ఆకలి దారిద్య్రం, హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మతోన్మాద విధానాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నైజాం రజాకారులను తలపించే పాలన కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే వామపక్ష పార్టీలు బూర్జువా పార్టీలకు తోకలాగా మారకుండా స్వతంత్రంగా ఎదిగేందుకు సామాజిక శక్తులను కలుపుకొని ఐక్య పోరాటాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. ఎంసీపీఐ(యు) రాష్ట్ర మహాసభలో పాల్గొన్న సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజీ నరసింహారావు, బాల మల్లేష్, ఎస్ యు సి ఐ, ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శులు కామ్రేడ్ మురహరి, జానకి రాములు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్ లు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఎంసీపీఐ(యు) రాష్ట్ర మహాసభలు జరగడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణకు పూనుకోవాలని ఈక్రమంలో ఐక్య కార్యాచరణ లో భాగంగా తాము భాగస్వామ్యం అవుతామని చెప్పారు. ఐక్య ఉద్యమాలే వామపక్ష సామాజిక శక్తులకు ప్రజలకు ఊతమిస్తాయని అందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహాసభలకు తీర్మానాల కమిటీ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, పెద్దారపు రమేష్,‌ సింగతి సాంబయ్య, వస్కుల మట్టయ్య, సబ్బని కృష్ణ, అర్హతల కమిటీగా ఎన్ రెడ్డి హంసారెడ్డి, నర్ర ప్రతాప్, మైత్రి రాజశేఖర్, మినిట్స్ కమిటీ సభ్యులు జబ్బర్ నాయక్, కర్రోల శ్రీనివాస్, కుసుంభ బాబురావు, కొండ శ్రీనివాస్ లతోపాటు స్టీరింగ్ కమిటీ గా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, గోనె కుమారస్వామి, తుకారాం నాయక్ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె మురళి అంగడి పుష్ప తుడుం అనిల్, దశరధ నాయక్, శ్రీనివాస్ వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here