రోడ్డు విస్తరణను కుదించిన ఎమ్మెల్యే గాంధీకి కృతజ్ఞతలు – ప్రభుత్వ విప్ గాంధీని సన్మానించి‌న న్యూ పీజేఆర్ కాలనీ సంక్షేమ సంఘం

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి ప్రధాన రోడ్డు విస్తరణతో పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్డు విస్తరణను కుదించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి న్యూ పీజేఆర్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గాంధీని కలిసిన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. పీజేఆర్ సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ మీనాక్షి టవర్స్ నుండి నుంచి గచ్చిబౌలి ప్రధాన రహదారి పై వెళ్లేందుకు గచ్చిబౌలి ప్రధాన రహదారి పై వంతెనకు ర్యాంపుల నిర్మాణం జరుగబోతుందని, ఓ ఆర్ ఆర్ మధ్యలో నుంచి చేపట్టనున్న మరో వంతెన గచ్చిబౌలి పై వంతెన మీదుగా వెళ్లి ర్యాడి సన్ వద్ద ముగుస్తుందన్నారు. గచ్చిబౌలి ప్రధాన రహదారి విస్తరణ వలన పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆస్తులకు తీవ్ర నష్టం కలుగుతుందని, రోడ్డు విస్తరణ ను 200 ఫీట్లనుండి 150 ఫీట్ల వరకు తగ్గించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని గతంలో‌ కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రభుత్వ విప్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్న న్యూ పీజేఆర్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు

మా వినతి మేరకు రోడ్డు విస్తరణను కుదించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చాంద్ పాషా, పీజేఆర్ సంక్షేమ సంఘం సభ్యులు కైలాష్ సింగ్, అచేశ్వర్ రావు, దుర్గ ప్రసాద్, సయ్యద్ షౌకత్ హుస్సేన్, రంగారావు, సంకేశ్ సింగ్, కృష్ణ గౌడ్, ఎండీ రియజుద్దీన్, పౌల్ ప్రకాష్ , శైలేందర్ సింగ్, మహమ్మద్ అబ్దుల్ అజిజ్, పీవీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here