అనుమానాస్ప‌ద స్థితిలో యువ‌తి ఆత్మ‌హ‌త్య

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అనుమానాస్ప‌ద స్థితిలో ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఒడిశా రాష్ట్రం మ‌యూర్‌బంజ్ జిల్లా బిసోయ్ గ్రామానికి చెందిన ఉషారాణి ద‌ల్ (22) గ‌త రెండు సంవ‌త్స‌రాల క్రితం బ్ర‌తుకు దెరువు నిమిత్తం న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చి మాదాపూర్‌లోని సిద్దిక్‌న‌గ‌ర్‌లో ఓ గ‌ది అద్దెకు తీసుకుని త‌న సోద‌రి రూపావ‌తితో క‌లిసి జీవ‌నం సాగిస్తోంది. ఉషారాణి గ‌చ్చిబౌలి అంజ‌య్య‌న‌గ‌ర్‌లోని డీమార్ట్‌లో క్యాషియ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, రూపావ‌తి కొండాపూర్‌లోని ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్‌లో ప‌నిచేస్తోంది. బుధ‌వారం సాయంత్రం సుమారు 4:45 గంట‌ల‌కు రూపావ‌తి త‌మ గ‌దికి చేరుకుని త‌లుపు తీసేందుకు య‌త్నించ‌గా అవి రాలేదు. లోప‌లి నుంచి గ‌డియ పెట్టి ఉంద‌ని కిటికీ ద్వారా ప‌రిశీలించింది. ఆ స‌మ‌యంలో ఉషారాణి గ‌దిలోని పైక‌ప్పు ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని క‌నిపించింది. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా వారు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఉషారాణి మృతి చెందిన‌ట్లు నిర్దారించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా ఉషారాణి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌లేద‌ని, అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here