శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన అమ్మవారిని దర్శించుకుని లోకకల్యాణం కోసం ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని, సమాజంలో సౌభాగ్యం, సౌభ్రాతృత్వం, శాంతి నెలకొనాలని ప్రార్థించారు.





