శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): బతుకమ్మ నిమజ్జనాల నేపథ్యంలో గంగారం చెరువు, శబరి పార్క్లోని నిమజ్జన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు (GVPలు), స్వీపింగ్ పాయింట్లను పరిశీలించారు. డీఈఈ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్), ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఏ, రాంకీ బృందం సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పారిశుధ్య పరిస్థితులను సమీక్షించారు. అనంతరం చందానగర్లోని సిటిజన్ కాలనీ రోడ్డును కూడా సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.






