బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గాంధీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ బాలింగ్ గౌతమ్ గౌడ్ నేతృత్వంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. డప్పు చప్పుళ్లు, బాణసంచా సందడితో వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. అభిమానుల కోలాహలం మధ్య గాంధీ కేక్ కట్ చేసి, కార్యకర్తలు, నాయకులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు స్వీకరించారు.

ఈ సందర్భంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న తమ ప్రియతమ నాయకుడు ఆరెక‌పూడి గాంధీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నియోజకవర్గ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here