శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్లో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ సాయి బాబా, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆరెకపూడి గాంధీ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. దసరా పండుగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుప్రజ ప్రవీణ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ బల్ల తదితరులు పాల్గొన్నారు.






