శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, డివిజన్కు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరెకపూడి గాంధీని ఘనంగా సత్కరించి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజా నాయకుడు ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్కు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.





