ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం అని నొక్కి చెప్పిన మహానీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భారతావనిలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం ఉండాలని గట్టిగా నొక్కి చెప్పిన గొప్ప మహానీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. దేశంలో ద్వంద్వ నీతికి చెక్ పెట్టిన మహనీయుడు, 370 ఆర్టికల్ రద్దుకు స్ఫూర్తి ప్రదాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మబలిదాన్ దివాస్ సందర్భంగా కొండాపూర్ డివిజన్, మసీదు బండ లో బిజెపి నాయకులతో కలిసి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమగ్రత, దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసే నాటి నెహ్రూ విధానాలను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రత్యేక సంస్థానంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ వెళ్లాలంటే నాడు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, 370 ఆర్టికల్ విధానాన్ని వ్యతిరేకించి రద్దు అయ్యేందుకు పోరాడి అక్కడే శ్యామ్ జీ ఆత్మబలిదానమయ్యారని అన్నారు‌. శ్యామ్ ప్రసాద్ ప్రాణత్యాగం వృధాకాకుండా దేశ ప్రజల అభిష్టం మేరకు ప్రధాని నరేంద్రమోడీ 370 ఆర్టికల్ రద్దు చేశారన్నారు. దేశం మొత్తం ఒక్కటే భారత రాజ్యాంగం అమలు చేస్తున్న ఘనత బిజెపి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, లింగంపల్లి కాంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేశ్, కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్, మహిళా నాయకులు పద్మ , గణేష్ ముదిరాజ్, శ్రీధర్ గౌడ్ , లక్ష్మణ్, శ్రీను, జె రవి గౌడ్, బాల, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మసీద్ బండలో మొక్కలు నాటుతున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here