నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్ కాలనీలో చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా పర్యటించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాలనీలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. సీజనల్ వ్యాధులు, దోమల నివారణకు పట్టణ ప్రగతి దోహదపడుతుందని అన్నారు. ఇంట్లో చెత్తను ఎక్కడపడితే వేయకూడదని, ఇంటి ముందుకొచ్చే మున్సిపల్ చెత్త బండికి అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, ఏఎంఓహెచ్ నగేష్ నాయక్, స్ట్రీట్ లైట్స్ ఏఈ రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు చెన్నం రాజు, శ్రీను పటేల్, దారుగుపల్లి నరేష్, వినోద్, మల్లేష్,రాజు ముదిరాజ్, అక్బర్, అనిల్ సింగ్, మధు, శ్యామ్లెట్ శ్రీనివాస్, సుధీర్, ఖాదర్ ఖాన్, రామేశ్వరమ్మ, అంజమ్మ, బాలమని, శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.