నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో గుజరాత్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎక్స్‌టెన్షన్ కాటేజ్ (ఇండెక్స్-సి) జూన్ 2 నుండి 12వ తేదీ వరకు గుర్జారి హస్తకళ హాత్ 2022 ను గుజరాత్ కళాకారులచే చేనేత హస్తకళ కళాఖండాల ప్రదర్శన, విక్రయం స్టాల్స్ ను నిర్వహించనున్నట్లు ఇండెక్స్- సి మేనేజర్ మార్కెటింగ్ డాక్టర్ స్నేహాల్ మఖ్వాన, శిల్పారామం మేనేజర్ అంజయ్య తెలిపారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇండెక్స్-సి గుజరాత్ ప్రభుత్వంలోని పరిశ్రమలు గనుల శాఖ కింద పని చేస్తుందని, ఇది చేతివృత్తులవారి జీవనోపాధిని పెంపొందించడం, గుజరాత్‌లోని సుదూర గ్రామాల నుండి వచ్చి సాంప్రదాయ కళాకృతులను అనుసరించే కళాకారులచే చేనేత హస్తకళల ప్రత్యక్ష కళాకృతులకు మార్కెటింగ్ వేదికను అందించడం వంటి ప్రాథమిక లక్ష్యంతో పని చేస్తుందన్నారు.
కుటీర, గ్రామీణ పరిశ్రమల కింద గుజరాత్ ప్రభుత్వం స్వావలంబన దృక్పథం వైపు ఒక అడుగుతో, హస్తకళలకు సంబంధించిన కళాకారుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. కళాకారులను స్వయం సమృద్ధిగా మార్చడం, మెరుగైన మార్కెట్‌ను సృష్టించడం, చివరికి వారి ఆదాయం పెరుగుదలతో వారికి సేవ చేయడం జరుగుతుందన్నారు. కోవిడ్-19 మార్గదర్శకాలకు కట్టుబడి, ఇండెక్స్-సి ఈవెంట్‌ను 2022 జూన్ 2 నుండి 12వ తేదీ వరకు ఉదయం 10:30 నుండి రాత్రి 8 గంటల వరకు శిల్పారామంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజలు మెచ్చుకునే చేనేత హస్తకళలు ఉత్పత్తులు కచ్చి ఘోడి ప్రదర్శన, తోలుబొమ్మల , రాస్ గర్భ నృత్యాలు తదితర వాటిని ఆస్వాదించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో, సాంప్రదాయ గుజరాతీ రస్-గర్బా సాంస్కృతిక కార్యక్రమం క్రీడలు, యువజన సాంస్కృతిక కార్యక్రమాల విభాగం, గుజరాత్ ప్రభుత్వం సహకారంతో నిర్వహించబడిందన్నారు. అవార్డు గ్రహీత ఆర్టిజన్, అంతరించిపోయిన కళ లాంగ్విషింగ్ క్రాఫ్ట్ ఆర్టిజన్ ప్రత్యక్ష ప్రదర్శనలు చేయబోతున్నట్లు చెప్పారు. గుజరాత్ రాష్ట్రం నుండి 70 మందికి పైగా మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్ ఈ ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు. ఈ కళాకారులు పటోలా నేయడం, తంగలియా నేయడం, శాలువ నేయడం, కుచ్చి-ఎంబ్రాయిడరీ, అజ్రఖ్ బ్లాక్ ప్రింట్, టై అండ్ డై (బంధేజ్), లెదర్ వర్క్, కాపర్ బెల్, మడ్ మిర్రర్ వంటి ఈవెంట్‌లలో వారి గొప్ప ఆచార కళ క్రాఫ్ట్‌లను ప్రదర్శిస్తారన్నారు. జరీ-జర్దోసీ వర్క్, పూసల పని, అగేట్ ఆర్టికల్స్, చనియా చోలీ, అప్లిక్ వర్క్, వుడెన్ అండ్ మెటల్ వర్క్, ఆభరణాలు, ఉపకరణాలు, గృహాలంకరణ అండ్ ఫర్నిషింగ్‌లు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని 2022 జూన్ 2వ తేదీన సాయంత్రం 5:00 గంటలకు, శిల్పారామంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం డీఎం శుక్లా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇండెక్స్- సి మార్గదర్శకత్వంలో జరుగుతోందన్నారు. ఆర్ ఎస్ షా, మేనేజర్(క్లాస్-1), ఇండెక్స్-సి, ప్రోగ్రామ్ ఇండెక్స్-సి మేనేజర్ (మార్కెటింగ్) డా.స్నేహల్ మక్వానా పర్యవేక్షణలో నిర్వహించబడుతుందన్నారు. ప్రవీణ్ సోలంకి చైర్మన్లు, ఇండెక్స్-C కార్యదర్శి, కమిషనర్, కుటీర గ్రామీణ పరిశ్రమలు హైదరాబాద్‌లోని మాదాపూర్ లోని శిల్పారామం లో గుర్జారి హస్త కళా హాట్ చెందిన మాస్టర్ క్రాఫ్ట్‌మెన్‌ల గొప్ప వారసత్వ వారసత్వాన్ని ఆదరించడానికి వారి నుండి నేరుగా హస్తకళ-చేనేత కళాఖండాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రిని పవన్ కుమార్ శిష్య బృందంచే పేరిణి నాట్యం, కిరణ్మయి బోనాల శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నాతు. ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు యంపీ థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంజరుగుతుందన్నారు.