మన్సూన్ వాహనాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: రాబోయే వర్షాకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన మన్సూన్ వాహనాలను చందానగర్ సర్కిల్ కార్యాలయంలో డీసీ సుదాంష్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, వి. జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు.

చందానగర్ సర్కిల్‌ కార్యాలయంలో మన్సూన్ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ, కార్పొరేటర్లు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక మన్సూన్ టీంలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల్లో, నాలాల్లో వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ కార్తీక్, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఈ.ఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, సురేష్, ఏఈ ప్రతాప్, ప్రశాంత్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నరేందర్, శేఖర్ రెడ్డి, వర్క్ ఇన్ స్పెక్టర్లు హరీష్, చారి, వెంకటేష్, శర్మ, బాలు తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ సర్కిల్ పరిధిలోని మన్సూన్ సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here