నమస్తే శేరిలింగంపల్లి: క్రీడలు చిన్నారుల్లో ఆత్మవిశ్వాసంతో పాటు మనో ధైర్యం నింపుతాయని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పిజెఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపులో భాగంగా 6 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు.అథ్లెటిక్స్ కోచ్ డగ్లస్ బెర్నార్డ్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్, మాస్టర్ అథ్లెటిక్స్ సెక్రటరీ సురేందర్, నేషనల్ మెడలిస్ట్ స్వాతి ధర్మపురి, హ్యాండ్ బాల్ నేషనల్ ప్లేయర్ నోబీ బెర్నార్డ్, వరలక్ష్మి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఎం.శ్రీనివాసులు, జూరేందర్, రామేల్, రాంయేల్ పాల్గొన్నారు.