శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తన జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని తన కార్యాలయంaలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో పాగా వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎంకు వివరించామని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. అందరూ కలసి కట్టుగా పోరాడి విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు.