శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శేరిలింగంపల్లి సర్కిల్ డీసీ ప్రశాంతి, చందానగర్ సర్కిల్ డీసీ మోహన్ రెడ్డి, కూకట్‌పల్లి సర్కిల్ డీసీ గంగాధర్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా పని చేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యేలా చూడాలని, పనులలో వేగం పెంచాలని, సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.