శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థులకు మానసిక వికాసంతోపాటు శారీరక వికాసం కూడా చాలా అవసరమని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన సొంత ఖర్చులతో రూ. 1 లక్ష విలువగల క్రీడా సామాగ్రిని విద్యార్థులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక వికాసంతోపాటు శారీరక వికాసం కూడా చాలా అవసరమని, విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఒకప్పుడు తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకుని ఉన్నతమైన స్థాయికి ఎదిగానని, ప్రతిఒక్క విద్యార్థి క్రమశిక్షణగా చదువుకుని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ఇంచార్జి హెచ్ఎం బల్వంత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, వెంకటేష్, ఉపాధ్యాయులు పీడి కేశవ రెడ్డి, లక్ష్మి, ఉదయ్ కుమారి, దుర్గ భవాని, సూర్యప్రభ, వీరేశం, ధనలక్ష్మి, పద్మావతి, కరుణ, సిద్ధిరామేశ్వర్, నర్సింహులు, పద్మజ, పద్మ కుమార్, విజయ తదితరులు పాల్గొన్నారు.