నమస్తే శేరిలింగంపల్లి: ఆలయాల అభివృద్ధికి తనవంతు సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల దుర్గంచెరువు శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు. ఆలయాల సందర్శన మానసిక ప్రశాంతత కలిగిస్తుందన్నారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆలయ అభివృద్ధిలో సమావేశంలో పాల్గొన్నారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, బీజేవైఎం నాయకులు, మహిళా మోర్చా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.