శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) జనరల్ సెక్రెటరీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలను శేరిలింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగదీశ్వర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పల్లె వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పాపిరెడ్డి కాలనీలోని సంకల్ప ఫౌండేషన్ అనాధాశ్రమంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ప్రైమరీ పాఠశాలకు చేరుకుని అక్కడి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమాలలో జగదీశ్వర్ గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్వాయి రాజు, వజ్జల శ్రీనివాస్, భరత్ చారి, రాములు, పి. కృష్ణ లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జగదీశ్వర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.