శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ జన్మదినం సందర్భంగా శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన 5కె రన్ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, మానేపల్లి సాంబశివరావు, సరస్వతి, మాధవి, కృష్ణ గౌడ్, శంకర్ గౌడ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా. వారు ఆపరేషన్ సిందూర్, పహల్‌గాం దాడి, విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థంగా నివాళులు అర్పించారు.