శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకుడు, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ జన్మదినం సందర్భంగా నల్లగండ్ల గ్రామంలోని శ్రీ కృష్ణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్, నాయకులు రోహిత్ గౌడ్, వివేక్ గౌడ్ సందర్శించి రక్తదాన దాతలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అండగా నిలిచారని, ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిరియాల రాఘవరావు, శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బాలరాజ్ ముదిరాజ్, నల్లగండ్ల ప్రధాన కార్యాలయం అధ్యక్షుడు భీమను ఆదిత్య ముదిరాజ్, నాయకులు మల్లికార్జున్ యాదవ్, బాలకృష్ణ, యాదగిరి, సతీష్, భాస్కర్, జయసాయి, రాజు, శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.