శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా లిఖించిన ప్రజలకథే – నా ఆత్మకథ పుస్తకానికి సంబంధించిన ధన్యవాదాల సమావేశాన్ని చందానగర్ డివిజన్ దీప్తి శ్రీ నగర్ కాలనీలో బీజేపీ సీనియర్ నాయకుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ నివాసంలో నిర్వహించారు. ఇందులో దత్తాత్రేయతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుడు, శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా బండారు దత్తాత్రేయ స్వహస్తాలతో తన ఆత్మకథ పుస్తకాన్ని రవికుమార్ యాదవ్ అందుకున్నారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇలా పుస్తకం అందుకోవడం ఆనందకరం అని అన్నారు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. ఒక ప్రజా నాయకుడి భావజాల పునాదిని, జీవిత పోరాటాన్ని, దేశాభివృద్ధిపై ఆయన దృక్పథాన్ని సమగ్రంగా వివరిస్తున్న ఈ ఆత్మకథ భవిష్యత్ నాయకులకు మార్గదర్శినిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర , జిల్లా, నియోజవర్గ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.