శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న వివిధ సమస్యల పై బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ యశ్వంత్ కుమార్, రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్వి కో ఆర్డినేటర్ ఎ దుర్గా ప్రసాద్, జె కిరణ్, వై. రాజు, శేరిలింగంపల్లి బి ఆర్ ఎస్ వి ఇంచార్జీ వై రాజు, స్థానిక బిఆర్ ఎస్ పార్టీ నాయకులు, హఫీజ్ పేట్ డివిజన్ బి ఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి బి.సి సెల్ అధ్యక్షుడు ముద్దంగుల మల్లేష్ ల ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం ను నిర్వహించారు.
పాఠశాలలలో ఉన్న సమస్యలను విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వై. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠశాలలోకి వరద నీరు రాకుండా ప్రధాన గేట్ వద్ద డ్రైనేజ్ మ్యాన్ హోల్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు. మెయిన్ గేట్ నుండి లోపలి వరకు ఒక ర్యాంపు ను తన స్వంత ఖర్చులతో నిర్మిస్తానని వాలా హరీష్ రావు స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ కు హామీ ఇచ్చారు. స్కూల్ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని బి ఆర్ ఎస్ వి విభాగం తో పాటు వాలా హరీష్ రావు, ముద్దంగుల మల్లేష్ లు ఈ సందర్భంగా తెలిపారు.