రాజీవ్ గాంధీ నగర్ లో ప‌ర్య‌టించిన‌ కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

రాజీవ్‌గాంధీ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేశ్ గౌడ్‌

ఆల్విన్ కాలనీ(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డివిజన్ ప‌రిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ డివిజన్ నాయకులతో కలిసి 30 వ రోజు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలో డ్రైనేజీ విస్తరించాల్సిన అవసరం ఉందని కాలనీ ప్రారంభంలో ఏర్పాటుచేసిన డ్రైనేజీలు అవ్వడం వల్ల తరచు పొంగుతూ ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. రెండు వారాల్లో డ్రైనేజీ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అనంతరం రోడ్డు నిర్మాణం పనులు కూడా పూర్తి చేస్తామని వెంక‌టేష్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామకృష్ణ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యులు శీను , కాశీనాథ్ యాదవ్, సీనియర్ నాయకులు బోయే కిషన్, నాయకులు గుడ్ల శీను, మున్నాభాయ్, యాదగిరి, రాజు పటేల్, వెంకట్ నాయక్, శశి, కటికే రవి, రామచందర్, మౌలానా , హరీష్, సాయి తదితరులు ఉన్నారు.

కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేశ్‌గౌడ్‌కు స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తున్నరాజీవ్‌గాంధీన‌గ‌ర్ వాసులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here