చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జనసేన పార్టీ చందానగర్ డివిజన్ నూతన కార్యవర్గం నియామకం అయింది. అధ్యక్షుడిగా బి.అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఏడుకొండలు, జయనాథ్, ప్రధాన కార్యదర్శిగా సరోజ ప్రదీప్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ప్రభాకర్ రావు, శివ కుమార్, రాజగోపాల్, సభ్యులుగా లక్ష్మణ కుమార్, సతీష్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా మణికంఠ నియమితులయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగంలు శనివారం నూతన అధ్యక్షుడు అరుణ్ కుమార్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ లో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళతామని, ముఖ్యంగా యువతను ఏకం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతామని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగంలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.