ఎల్ఆర్ఎస్ ను వెంటనే ఉపసంహరించుకోవాలి: కసిరెడ్డి భాస్కరరెడ్డి

ర్యాలీలో పాల్గొన్న బిజెపి నేత‌లు క‌సిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, బుచ్చిరెడ్డి, రాంరెడ్డి త‌దిత‌రులు

– ఎల్ఆర్ఎస్‌కు వ్య‌తిరేఖంగా చందాన‌గ‌ర్‌లో బిజెపి నాయ‌కుల నిర‌స‌న‌న ర్యాలీ, ద‌ర్న‌
చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉపసంహరించుకోవాలని బిజెపి రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ నిర్వహించారు. చందానగర్ గాంధీ విగ్రహం వ‌ద్ద ప్రారంభ‌మైన ర్యాలీ మంజీరా రోడ్డు మీదుగా సర్కిల్ 21 చేరుకుంది. అక్క‌డ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా నినాదాలు చేసిన అనంత‌రం అంబెడ్కర్ విగ్రహం వద్ద ధర్న నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం పేద ప్రజల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. ఇదే విధంగా పాలన కొనసాగితే ప్రజలు తిరగబడే అవకాశముందని అన్నారు. అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని అంటూ కెసిఆర్ ప్రజావ్యతిరేక పాలనకు అంతం పలికే రోజులొచ్చాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, బిజెపి రాష్ట్ర సైనిక విభాగం జాయింట్ కన్వీనర్ నాగం రాజశేఖర్, రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ జాయింట్ కన్వీనర్ నూనె సురేందర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు రాకేష్ దూబే, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, సురేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ముదిరాజ్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, అమరేంద్ర ప్రతాప్ సింగ్, చిలకమర్రి శ్రీనివాస్ రెడ్డి, లలిత, నిషాద్, కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాల‌యం వ‌ద్ద నిర‌స‌స తెలుపుతున్నచందాన‌గ‌ర్ బీజేపీ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here