ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను కాలనీవాసులు కార్పోరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా రోడ్డు తాగునీటి సమస్యల తీవ్రతను దొడ్ వెంకటేష్ గౌడ్ కు వివరించారు. స్పందించిన కార్పోరేటర్ జలమండలి అధికారులతో మాట్లాడి నీటి సరఫరా సజావుగా జరిగేలా చూస్తానని రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామకృష్ణ గౌడ్ ,డివిజన్ అధ్యక్షుడు గణేష్, మాజీ అధ్యక్షుడు పాండు గౌడ్, వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్, నాయకులు బోయ కిషన్, రాములు గౌడ్, వాసు , కురుమయ్య, వెంకట్ నాయక్, మహేష్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎస్ కె బి బి, సరూప రెడ్డి, అమృత, లలిత తదితరులు ఉన్నారు.