చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తారనగర్ తుల్జాభవాని ఆలయ పాలకమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున శర్మకు బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాగిరి సాయిరాం గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం వారి నివాసంలో మల్లికార్జున శర్మ దంపతులను సన్మానించిన సాయిరాంగౌడ్ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. శేరిలింగంపల్లిలో అసలు సిసలైన ఉద్యమకారుడు శర్మ అని, ఎట్టకేలకు వారికి దక్కిన గౌరవానికి తోటి ఉద్యమకారుడిగా గర్వపడుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, ఆశీల శివ, యువతేజ్ గౌడ్, అభయ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.