నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భాస్కర్ డ్యాన్స్ అకాడమీ నుంచి సాత్విక ఆధ్వర్యంలో శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. మూషిక వాహన, గణేశా పంచరత్న, కృష్ణాష్టకం, శ్రీ రఘురాముని దివ్య కథ, గోవిందా గోవిందా, రామాయణ శబ్దం, వందేమాతరం, వినరో భాగ్యము, బృందావనం, అంశాలను సాత్విక,మేఘన, అక్షర, నీలిమ, చరిత, స్నికిత, నక్షత్ర, మోక్షిత తదితరుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి.