నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఓంకార్ భవన్ లో ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరగనున్నట్లు ఎంసీపీఐయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ తెలిపారు. కామ్రేడ్ అనుభవ్ దాస్ శాస్త్రి అధ్యక్షతన మొదటి రోజు పొలిట్ బ్యూరో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో సభ్యులు ఉత్తర ప్రదేశ్ నుంచి కామ్రేడ్స్ అనుభవ దాస్ శాస్త్రి, కేరళ నుంచి ఎస్. రాజా దాస్, పంజాబ్ నుంచి కిరణ్ జిత్ సింగ్ షేఖాన్, రాజస్థాన్ నుంచి మహేందర్ నేహే, తమిళనాడు నుంచి ఇ జార్జ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కాటం నాగభూషణం, తెలంగాణ నుంచి వల్లెపు ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.