శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రవి కుమార్ యాదవ్ కి ఆ పార్టీ నాయకుడు పులిపలుపుల రాజేష్ గౌడ్ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ.. రవి కుమార్ యాదవ్ సారథ్యంలో పార్టీ కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేసి త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మియాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయా డివిజన్లన ఉంచి పోటీ చేసేందుకు ప్రజల్లో మంచి పేరు ఉండి, పార్టీ కోసం కష్టపడే వారికే టికెట్ కేటాయించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత పి జనార్దన్ రెడ్డి కాలం నుంచి తన గురువు భిక్షపతి యాదవ్ వరకు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశామని అన్నారు. త్వరలో జరగబోయే ఎలక్షన్స్ లో తమకు కూడా అవకాశం కల్పించాలని రవి కుమార్ యాదవ్ ని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, శ్రీధర్, చిన్నా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.