నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సఫారీ నగర్ లో బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డ్, ఈ -శ్రమ్ కార్డ్ కోసం దరఖాస్తు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి కార్డులను రవికుమార్ యాదవ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 లక్షల రూపాయల బీమా మొత్తంతో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అర్హులకు ఇస్తుందని అన్నారు. దేశ వ్యాప్తంగా వేలాది నెట్ వర్క్ హాస్పిటల్స్ వద్ద ఈ పథకం ద్వారా హెల్త్ కార్డ్ ఉన్నవారికి నగదు రహిత చికిత్స అందుతుందని చెప్పారు. ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని హెల్త్ కార్డును పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ శ్రమ్ కార్డును రూపొందించిందని చెప్పారు. ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ కార్డు పొందవచ్చన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు సాగర్, అసెంబ్లీ కన్వీనర్ పద్మ, మహిళ డివిజన్ ప్రెసిడెంట్ రేణుక, లక్ష్మీ, నాగు భాయ్, నాగేంద్ర, పార్వతి, లావణ్య, సాయికుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.