నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లోటస్ ఫార్మసీ వద్ద రూ. 19.50 లక్షల అంచనావ్యయం తో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అర్థరాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. చందానగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు ప్తజలకు అవసరమయ్యే అన్ని వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, గురు చరణ్ దూబే, మల్లేష్ గుప్తా, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
