నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి ఎదుగుదలను చూస్తుంటే సీఎం కేసీఆర్ కు వణుకు పుట్టి శాసనసభలో నుంచి ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ అన్నారు. బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దుగ్యాల ప్రదీప్ మాట్లాడుతూ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉండాలని కోరినందుకు బిజెపికి చెందిన ఎమ్మెల్యేలను శాసన సభ నుండి సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని అన్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా ఇంచార్జీ ఎండల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ కేసీఆర్ నియంత పోకడలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ సమావేశాలు ఇవేనని ఎద్దేవా చేశారు. రవి కుమార్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం తథ్యమని చెప్పారు. కార్యకర్తలంతా ఏకతాటిపైకి ఉండి కష్టపడి పని చేయాలని సూచించారు. నిరసన దీక్షలో మువ్వా సత్యనారాయణ, కసిరెడ్డి సింధు రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, నాగేశ్వర్ గౌడ్, రాధా కృష్ణ యాదవ్, పద్మ, బిజెవైఎం నాయకులు లంగటి నరేందర్ రెడ్డి, నందనం విష్ణు దత్తు, హరికృష్ణ, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కాంటెస్ట్ కార్పోరేటర్లు, మహిళా మోర్చా నాయకురాళ్ళు, బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.