ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకట పాపయ్య నగర్ కు నూతనంగా నియమితులైన ఏరియా కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏరియా కమిటీ సభ్యులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని అన్నారు. నూతనంగా నియమితమైన ఏరియా కమిటీ ప్రతినిధులు ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దేవేందర్, క్యాషియర్ నారాయణ, జాయింట్ సెక్రటరీ నర్సింహులు, కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.