చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు టీఆర్ఎస్ యువనేత మిరియాల ప్రీతమ్ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో బుధవారం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి పట్టభద్రుల ఓటరు నమోదుపై మిరియాల ప్రీతమ్ అవగాహన కల్పించారు. పట్టభద్రులు నింపిన ఫాం – 18 ను మిరియాల ప్రీతమ్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి పట్టభద్రుల ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటర్ నమోదులో ఎవరికైనా సందేహాలు ఉంటే వారి ఇంటి వద్దకే వచ్చి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. రానున్న రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంతోష్, అఖిల్, సాయి కుమార్, శశిధర్, సాయి కిరణ్, దివాకర్, శివ, సాయి, అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.