టెలిఫోన్ కాలనీలో సిసి రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి

టెలిఫోన్ కాలనీలో సిసి రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ నవత రెడ్డి

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ టెలిఫోన్ కాలనీలో రూ.5 లక్షల బల్దియ నిధులతో చేపడుతున్న సి.సి రోడ్ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి బుదవారం పరిశీలించారు. ఈ సందర్భంగ నవతరెడ్డి మాట్లాడుతూ కాలనీలో రోడ్డు గుంతలుగా ఏర్పడటం వలన వాహనదారులు, కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని, వారి కోరిక మేరకు ఈ సి.సి రోడ్ నిర్మించడం జరుగుతుందని అన్నారు. సిసి రోడ్ పనులు ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేసి కాలనీ వాసులకు, వాహదారులకు సహకరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు సుబ్బారావు, హాషీం భయ్యా, రషీద్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

టెలిఫోన్ కాలని వాసులతో కార్పొరెటర్ బొబ్బ నవతరెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here