ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో స్థానిక సమస్య లపై కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. కాలనీలో కొంత భాగం ఎత్తుగా ఉండటంతో తాగునీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని, కాలనీలో పోల్స్ అవసరం ఉందని, శ్మశానవాటిక కు దారి నిర్మాణం అవసరం ఉందని స్థానికులు ఆయన దృష్టికి సమస్యలను తీసుకు వచ్చారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పోల్ ను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని, వీలైనంత తొందరగా తాగునీటి, డ్రైనేజీ విస్తరణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు బోయ కిషన్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, నాయకులు వాసు, రవీందర్, ధనలక్ష్మి, జి.లక్ష్మీ, ఎల్లమ్మ, భవాని, మధు తదితరులు పాల్గొన్నారు.