గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్ అసోసియేషన్ అనుబంధ కమిటీల ఎన్నిక

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ కు అనుబంధంగా నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని చైర్మన్ మిరియాల రాఘవ రావు తెలిపారు. అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఏమైనా సందేహాలు ఉన్నా నూతన కమిటీలు వాటి పరిష్కారానికి కృషి చేయనున్నాయ‌ని తెలిపారు.

నూత‌నంగా ఎన్నికైన గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్ అసోసియేషన్ అనుబంధ కమిటీల నాయ‌కులు

బిజినెస్ కమిటీ కన్వీనర్ గా కాశీ విశ్వేశ్వర రావు ఎన్నిక‌య్యారు. ఈ క‌మిటీలో ఐదు మంది సభ్యులు ఉంటారు. రిప్రజెంటేటివ్ కమిటీ కన్వీనర్ గా పి.బి.ఎస్. విశ్వనాథ్ ఎన్నిక‌వ్వ‌గా ఈ క‌మిటీలోనూ ఐదు మంది సభ్యులు ఉండనున్నారు. అలాగే సోషల్ యాక్టివిటీస్ కమిటీ కన్వీనర్ గా పి.ఎస్. భాస్కర్ రావు ఎన్నిక‌వ‌గా ఈ క‌మిటీలో ఐదు మంది సభ్యులు ఉండ‌నున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ కమిటీ కన్వీనర్ గా పులి మురళి ఎన్నిక‌వ‌గా ఈ క‌మిటీలో ఐదు మంది సభ్యులు ఉండ‌నున్నారు. రిక్రియేషన్ కమిటీ కన్వీనర్ గా ఎన్. సూరిబాబు ఎన్నిక‌వ‌గా ఈ క‌మిటీలో ముగ్గురు సభ్యులు ఉండ‌నున్నారు. అదేవిధంగా టెక్నికల్ కన్సల్టెంట్ కమిటీ కన్వీనర్ గా ఆర్. రమణ ఎన్నిక‌వ‌గా దీంట్లో ఐదు మంది సభ్యులు ఉండ‌నున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here