హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వం కేటాయించిన సగర ఆత్మగౌరవ భవన స్థలాన్ని మార్చకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఆత్మ గౌరవ భవనం కోసం ముందుగా కేటాయించిన స్థలాన్ని మార్చి మా జాతి ఆత్మ గౌరవాన్ని కించపరచవద్దని రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ మంత్రి కి విన్నవించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కులాలను గుర్తించి ఆత్మ గౌరవాన్ని పెంచితే అధికారులు కేటాయింపు స్థలాన్ని మారుస్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెడ్డపేరు తెస్తున్నారని తెలిపారు. అధికారుల కుట్రలు కొనసాగితే సహించేది లేదని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్.బి. ఆంజనేయులు సగర, సీనియర్ సగర సంఘం నాయకుడు అస్కాని శ్రీనివాస్ సగర లు ఉన్నారు.