నమస్తే శేరిలింగంపల్లి: కంచి పరమాచార్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని మూడేళ్లుగా వేద పాఠశాలల్లోని విద్యార్థులకు వేద రక్షణం సమితి ఆసరాగా నిలుస్తోందని చందానగర్ వేద రక్షణం సమితి అధ్యక్షుడు వి. రాధాకృష్ణ మూర్తి పేర్కొన్నారు. దమ్మాయి గూడెం లో రమణమహర్షి వేద పాఠశాలలో 15 మంది వేదవిద్యార్థులకు, ఈసీఐఎల్ పరిసర ప్రాంతంలోని సాకేత్ నగర్ లో గల సాందీపని గురుకుల సేవా ట్రస్ట్ 40 మంది వేద విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను చందానగర్ వేద రక్షణం సమితి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ వేద రక్షణం సమితి ద్వారా వేద విద్యార్థులకు, వేద పాఠశాలలకు వస్తు రూపంలో, ధన రూపంలో సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. వృద్ధులైన వేద పండితులకు ఆర్థిక సహాయం చేయడం లాంటివి చేస్తున్నామని అన్నారు. ఇలాంటి సత్కార్యాల్లో పాలుపంచుకునే వారు తోచినవిధంగా సహాయం చేయవచ్చన్నారు. వేద రక్షణం సమితి, అకౌంట్ నంబర్ 50100359650543, హెచ్ డీ ఎఫ్ సీ, చందానగర్ బ్రాంచ్ కు తోచినంత విరాళాలు పంపవచ్చన్నారు. మరిన్ని వివరాలకు సెల్ ఫోన్ నంబర్ 8374215609 ను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కెవి సుబ్బారావు, జనరల్ సెక్రటరీ జ్యోత్స్న, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసు, ట్రెజరర్ పూర్ణిమ, చీప్ అడ్వయిజర్ వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ యం. మస్తాన్ రావు, ధర్మారావు, శ్రీవల్లి, టి.వి గుప్తా తదితరులు పాల్గొన్నారు.