నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పై, బిజెపి నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బిజెవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ అమర్ నాథ్ యాదవ్ డిమాండ్ చేశారు. బిజెవైఎం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను రాయదుర్గం చౌరస్తాలో బిజెవైఎం నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమర్ నాథ్ యాదవ్ మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వాఖ్యలు స్థాయికి మించి చేయడం సరికాదన్నారు. వెంటనే బేషరతుగా మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, బిజెవైఎం గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు రాఘవేందర్ ముదిరాజ్, నవీన్, బసంత్ సాయి, ప్రదీప్, అభిషేక్, ప్రసాద్, అభిషేక్, వెంకీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.
