డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు – రూ. 26 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం

నమస్తే శేరిలింగంపల్లి: కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించి‌నట్లు తెలిపారు.‌ అందులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ముఠాను పట్టుకు‌ని అరెస్టు చేశారు. ముఠా గుట్టును సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ పై ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మాదాపూర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న మహమ్మద్ అష్రాఫ్ బేగ్, రామేశ్వర శ్రవణ్ కుమార్, చరణ్ తేజ ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 183 గ్రాముల కొకైన్, 44 ఎం డి ఎస్టేసి టాబ్లెట్ స్వాధీనం చేసుకుని మొత్తం రూ. 26 లక్షల 28 వేల విలువ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

పెద్ద మొత్తంలో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన నిందితులు

నైజీరియా కు చెందిన జూడ్ అనే వ్యక్తి ద్వారా‌ ఈ డ్రగ్స్ ను ముఠా సభ్యులు సరఫరా చేస్తున్నారని అన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గోవా నుంచి భారీగా డ్రగ్స్ ను తెప్పించి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని వివరించారు. డ్రగ్స్ ను విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు జూడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 2021 వ సంవత్సరంలో ఇప్పటి వరకు 202 కేసులు నమోదు కాగా 419 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డ్రగ్స్ తో పట్టుబడిన 23 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసి వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here