నమస్తే శేరిలింగంపల్లి: దేశవ్యాప్తంగా బిసి కులగణనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రణదీప్ నుర్జీవాలకు కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీ రణదీప్ నుర్జీవాలాకు వినతి పత్రం అందజేశారు. ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రానదీప్ నుర్జీవాలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలిశారు. భారత ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో ఈసారి ఖచ్చితంగా బిసి కుల గణనను చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ పార్లమెంటు వద్దగల విజయ్ చౌక్ వద్ద వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రానదీప్ నుర్జీవాల మాట్లాడుతూ కుల గణన కోసం ఎలాంటి ఉద్యమానికైనా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షులు నెల్లి గురుదేవ్ జి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్, తెలంగాణ బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తీ ప్రశాంత్ యాదవ్, సిరవేన స్వప్న, నాగరాజు, ఆది మల్లేష్ పటేల్, ఊట్నూరి సత్యగౌడ్, కలాల్ నర్సింహులు, బండారి దేవేందర్, వాసం సాంబయ్య పటేల్, అబ్బగోని అశోక్ గౌడ్, సుంకరి పోతరాజు, కందుల అశోక్, మోతె రవికాంత్, ఎస్. శ్రీనివాస రావు, పాణ్యం కాశీం తదితరులు ఉన్నారు.