మంచిగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి – మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహించాలంటే చదువు చాలా అవసరం అని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. సందయ్య మేమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, ఆర్.పి కాలనీలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ చేతుల మీదుగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమాజంలో మనం ఉన్నతంగా జీవించాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. విద్యార్థి దశ నుండే శ్రద్ధగా చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఉన్నత విద్యనభ్యసించి మంచి స్థానంలో నిలిస్తే తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు పేరు తెచ్చినవారవుతారని చెప్పారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత సంవత్సరం కోవిడ్ వల్ల పాఠశాలల్లో బుక్స్ పంపిణీ చేయలేకపోయామని, చాలా దేశాలు, రాష్ట్రాలలో చదువు సరిగా అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంటర్ ఫలితాలలో చాలా మంది కోవిడ్ వల్ల చదువు సరిగా చెప్పే వాళ్ళు లేక, ఎలా చదవాలో తెలియక చాలా మంది ఫెయిల్ అయ్యారన్నారు. కోవిడ్ ను అధిగమించి విద్యార్థులు శ్రద్ధతో చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. పాఠశాలలో నీటి వసతి లేదని ప్రధానోపాధ్యాయులు కిషన్ చెప్పగా తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పరీక్షల సమయంలో స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేస్తామని రవికుమార్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కిషన్, లక్ష్మారెడ్డి, ఏకాంత గౌడ్, నర్సింగ్ రావు, కల్పన గౌడ్, దేవ భూషణం, శ్రీహరి, పర్వతాలు యాదవ్, బాలు యాదవ్ , శ్రీకాంత్, సాయి, శ్రీనివాస్, యాదగిరి, రాజు, సందీప్ ముదిరాజ్, మురళి, మనోజ్, శ్రీలత పద్మ ,రేణుక, మల్లికా తదితరులు పాల్గొన్నారు.

జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పుస్తకాలను పంపిణీ చేస్తున్న సందయ్య మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here