నమస్తే శేరిలింగంపల్లి: గణితశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన థియరీలు, సూత్రాలను మేధావులకు అంతుచిక్కని విధంగా పరిష్కరించిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ అని భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో భేరీ వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంగన్ వాడి పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్, పండ్లను విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా భేరి రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ గణితశాస్త్రానికి అందించిన గొప్ప మహనీయులు శ్రీనివాస రామానుజన్ అని అన్నారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్క అంశం గణితంతో ముడిపడి ఉందని అన్నారు. రామానుజన్ ను ఆదర్శంగా తీసుకుని గణితంపై పట్టు సాధిస్తే అద్భుతమైన అవకాశాలు ఉంటాయని అన్నారు.నేటి సమాజంలో విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. విద్యార్థులు సంస్కారమైన విద్యను అభ్యసించాలని అన్నారు. సమాజమే ఒక దేవాలయంగా భావించాలన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న షార్ట్ ఫిలిం డైరెక్టర్ మధు రామానుజన్ గొప్పతనాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో భేరి చంద్ర శేఖర్ యాదవ్, భరత్, లవణ చారి, అశోక్, పీ.శ్రీను, అంగన్ వాడి స్కూల్ టీచర్, సిబ్బంది, విద్యార్థులు, యువజన నాయకులు పాల్గొన్నారు.